కొత్త కరోనా రకాలు రాకపోతే మూడో వేవ్ రాబోదు

లక్నో: కరోనాలోని కొత్త రకాలు రాకపోతే దేశంలో థర్డ్వేవ్ రాబోదని ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ సోమవారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. డెల్టా వేరి యంట్ ఒక్కటే ఉండి, మరో వేరియంట్ గనుక రాకపోతే మనం కరోనాపై చేస్తున్న పోరాటంలో విజయం సాధించినట్లేనన్నారు. ఒక్క కేరళలో వైరస్ అదుపులోకి వస్తే, దేశవ్యాప్తంగా కరోనా కట్టడి సాధ్యమయ్యిందని చెప్పుకోవచ్చు. రాబోయే నెల రోజుల్లో కేరళలోనూ కరోనా అదుపులోకి వచ్చే అవకాశాలున్నాయన్నారు. దేశంలోని 75 శాతం ప్రజలు కరోనాతో పోరాడగలిగే స్థాయిలో రోగనిరోధక శక్తి సాధించారు. ముమ్మర టీకాల ద్వారానే కరోనా కట్టడి సాధ్యమన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos