కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు

కొనసాగుతున్న కరోనా వైరస్ వ్యాప్తి.. 24 గంటల్లో 760 కొత్త కేసులు

న్యూ ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కొత్త కేసులు రోజురోజుకూ భారీగా పెరుగుతున్నాయి. తాజాగా 24 గంటల వ్యవధిలో 760 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో కలిపి దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 4,423కి చేరింది. నిన్న ఒక్కరోజే 775 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకూ కోలుకున్న వారి సంఖ్య 4.44 కోట్లకు (4,44,78,047) చేరింది. నిన్న కేరళలో ఒకరు, కర్ణాటకలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 0.01 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. రికవరీ రేటు 98.81 శాతం, మరణాల రేటు 1.18 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. ఇక ఇప్పటి వరకూ 220.67 కోట్ల (220,67,79,081) కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos