కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌

కేంబ్రిడ్జ్ ఎనలిటికాకు సీబీఐ షాక్‌

న్యూ ఢిల్లీ: ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తి గత డేటా చోరీ కుంభకోణంలో సీబీఐ కేంబ్రిడ్జ్ అనలిటికాపై శుక్రవారం కేసు నమోదు చేసింది. 5.62 లక్షల మంది భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల వ్యక్తిగత డేటాను అక్రమంగా సేకరించిందనేది ఆరోపణ. ఇదే ఆరోపణలతో ఆ దేశానికి చెందిన మరో సంస్థ గ్లోబల్ సైన్స్ రీసెర్చ్ (జీఎస్ఆర్ఎల్) ను కూడా కేసులో చేర్చింది.సుమారు 5.62 లక్షల భారతీయ యూజర్ల డేటాను అక్రమంగా సేకరించిన గ్లోబల్ సైన్స్ కంపెనీ ఆ డేటాను క్యాంబ్రిడ్జ్ అనలిటికాతో పంచుకుందని ఫేస్బుక్ తెలిపింది. తద్వారా ఎన్నికలను ప్రభావితం చేసిందని ఆరోపించింది. ఎన్నికలను ప్రభావితం చేసే లక్క్ష్యంతో కేంబ్రిడ్జ్ ఎనలిటికా భారతీయ ఫేస్బుక్ వినియోగదారుల డేటాను ఉపయోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos