మండుతున్న ఈశాన్యం

మండుతున్న ఈశాన్యం

న్యూఢిల్లీ : పౌరసత్వ చట్టాన్ని సవరించినందుకు నిరసనగా ఈశాన్య భారతంలో హింసాత్మక నిరసనలు గురు వారమూ కొన సాగాయి. పోలీసు కాల్పులు, లాఠీ చార్జ్, రైళ్ల నిలిపివేతతో అలజడి అధికమైంది. అసోం, త్రిపురల్లో సైన్యం, పారామిలటరీ బల గాలు రంగంలోకి దిగాయి. ఆందోళనకారులు నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వీధుల్లోకి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. విమాన, రైలు సర్వీసులు దెబ్బతిన్నాయి. కర్ఫ్యూ ఉత్తర్వులను ధిక్కరించి గువహటిలో పెద్దసంఖ్యలో ఆందోళనకారులు వీధుల్లోకి చేర డంతో పోలీసులు కాల్పులు జరిపారు.లాలుంగ్ గావ్ ప్రాంతంలో ఆందోళనకారులను చెదరగొట్టేందుకు కాల్పులు జరిపామని పోలీసు లు తెలిపారు. కాల్పుల్లో నలుగురు ఆందోళనకారులకు గాయాలయ్యాయని స్ధానికులు పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లో లోకల్ ట్రై న్ల ను నిలిపివేసారు. రైలు, విమాన సర్వీసులకు విఘాతం కలగడంతో ప్రయాణీకులు ఎక్కడికక్కడ నిలిచిపోయారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos