సరిహద్దులో కాల్పులు-బంకర్లలో బతుకులు

సరిహద్దులో కాల్పులు-బంకర్లలో బతుకులు

కథువా : పాక్, భారత జవాన్ల కాల్పుల వల్ల సరిహద్దు గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో విలవిలలాడుతున్నారు. ప్రజలు ఇళ్లను వదిలి బంకర్లలో బిక్కు బిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కుప్వారా జిల్లాలోని తంగ్ధర్ విభాగంలో నియంత్రణ రేఖకు సమీపంలోని గుండిషోట్ గ్రామంలో సిద్ధిఖ్ ఇంటి ఎదుట షెల్ పడటంతో ఆయన మరణించాడు. ముష్కరుల కాల్పులతో తాము భూగర్భ బంకర్లలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నామని, పిల్లలు ఏడుస్తున్నారని గుండిషోట్ నివాసి ఇష్ఫాక్ అహ్మద్ చెప్పారు. పాక్ షెల్స్ పేల్చినందున ఎనిమిది ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆరు ఆవులు, పది మేకలు మరణించాయి. 744 కిలోమీటర్ల పొడవైన నియంత్రణ రేఖ వద్ద భారత-పాక్ 2003 నుంచి కాల్పుల విరమణకు అంగీకరించినా, పాక్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ తరచూ కాల్పులకు దిగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos