తగ్గిన వెండి, బంగారం ధరలు

తగ్గిన వెండి, బంగారం ధరలు

దిల్లీ: అంతర్జాతీయ పరిణామాల కారణంగా బుధవారం బంగారం ధర తగ్గింది. రూ.115 తగ్గడంతో పది గ్రాముల స్వచ్ఛమైన పసిడి రూ.33,210కి చేరింది. దేశీయ మార్కెట్లో ఆభరణాల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ మందగించడం బంగారం తగ్గుదలకు మరో కారణంగా బులియన్‌ ట్రేడింగ్‌ వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉంటే వెండి ధర మాత్రం పెరిగింది. పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల దగ్గర నుంచి డిమాండ్‌ లభించడంతో వెండి ధర పెరిగినట్లు ట్రేడర్లు చెబుతున్నారు. రూ.310 పెరగడంతో కిలో వెండి రూ.40,160కి చేరింది. అటు అంతర్జాతీయంగాను బంగారం ధర తగ్గింది. న్యూయార్క్‌ మార్కెట్లో బంగారం ధర 0.11శాతం తగ్గడంతో ఔన్సు 1,284.30డాలర్లు పలికింది. వెండి 0.16శాతం పెరగడంతో ఔన్సు 15.43డాలర్లు పలుకుతోంది. 99.9శాతం పసిడి ధర రూ.33,210గా ఉండగా, 99.5శాతం పసిడి ధర రూ.33,060గా ఉంది. నిన్నటి ట్రేడింగ్‌లో పసిడి రూ.125 పెరిగిన విషయం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos