తీవ్రం కానున్న బుల్‌బుల్‌

తీవ్రం కానున్న బుల్‌బుల్‌

విశాఖ పట్నం : తూర్పు మధ్య బంగాళా ఖాతంలోని బుల్బుల్తుఫాను తీవ్ర రూపాన్ని దాల్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం రాత్రికి ఒడిసాకు దక్షిణ ఆగేయ దిశగా 640 కి. మీ దూరంలో, పశ్చిమ బెంగాల్కు దక్షిణ ఆ గ్గేయ దిశగా 740 కి.మీ దూరంలో కేంద్రీ కృతమై ఉంది. వచ్చే 24 గంటల్లో తీవ్ర తుఫాన్గా మారవచ్చు. శనివారానికల్లా ఉత్తర దిశగా పయనించి పశ్చిమ బెంగాల్, బంగ్లా దేశ్ తీరాల వైపు ప్రయాణించ వచ్చు. ఇందువల్ల కోస్తాలో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే వీలుంది. ఒడిశా తీరం వెంబడి గంటకు 70 నుంచి 80/90 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos