ఏడాది వేతనం కరోనా నిధికి

ఏడాది వేతనం కరోనా నిధికి

బెంగళూరు : కొవిడ్-19 ముఖ్యమంత్రి సహాయనిధికి కర్నాటక ముఖ్యమంత్రి యడియూరప్ప బుధవారం తన ఏడాది జీతాన్ని విరాళంగా ప్రకటించారు. ‘కరోనా వైరస్ ప్రబలుతున్నవేళ మనమందరం ఎదుర్కొంటున్న కష్టమైన సమయం. మనమంతా కలిసి ఈ అంటువ్యాధితో పోరాడటం ముఖ్యం. వ్యక్తిగతంగా, నేను నా ఒక సంవత్సర జీతాన్ని సీఎంఆర్ఎఫ్ కోవిడ్ 19 కి విరాళంగా ఇస్తున్నాను. కరోనా కట్టడి కోసం సహాయం చేయమని నేను మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను’ అని ట్వీట్ చేసారు. మంత్రులు, పార్లమెంటు సభ్యులు,శాసనసభ్యులు, అధికారులు, ప్రజలు కరోనా సీఎం సహాయనిధికి విరాళాలు అందించాలని కోరారు.

తాజా సమాచారం