మెదడుకు మేత

మెదడుకు మేత

మానవ శరీరంలో సూపర కంప్యూటర్‌గా పని చేసే మెదడు దెబ్బ తినకుండా సకల జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార, వ్యాయామ నియమాలు పాటించకపోతే మెదడు దెబ్బ తిని, అనారోగ్యం బారిన పడాల్సి వస్తుందని ప్రతి ఒక్కరూ గమనించాలి. ఉదయం అల్పాహారం తీసుకోవడం మానేస్తే, రక్తంలో షుగర్‌ లెవల్స్‌ తగ్గి మెదడు మొద్దు బారిపోతుంది. శరీరంలో అన్ని భాగాల కంటే ఎక్కువ శక్తిని సంగ్రహించేది మెదడే. కనుక ఎప్పటికప్పుడు ఆహారం తీసుకుంటూ, దానికి శక్తినందించాలి. అలాగే మెదడు సక్రమంగా పని చేయాలంటే బాగా నిద్రపోవాలి. లేకపోతే మానసిక సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. నిద్రలేమి ఒక ప్రమాదంలో తలకు తగిలే గాయంతో సమానమని వైద్యులు చెబుతారు. అవసరానికి మించి ఆహారం తీసుకున్నా, మెదడుకు నష్టం వాటిల్లుతుంది. కనుక అతిగా తినడం మానుకోవాలి .

తాజా సమాచారం

Latest Posts

Featured Videos