50శాతం కుళ్లిపోయిన దిశ నిందితుల మృతదేహాలు..

50శాతం కుళ్లిపోయిన దిశ నిందితుల మృతదేహాలు..

పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన దిశ హత్యాచార నిందితుల శవాలు పూర్తిగా కుళ్లిపోయే దశకు చేరుకున్నాయని గాంధీ మార్చురీ వైద్యులు కోర్టుకు తెలిపారు.ఎన్‌కౌంటర్‌పై అనుమానం వ్యక్తంచేస్తూ… ఈ నెల 17న మహిళా సంఘాలు సుప్రీంకోర్టుకు వెళ్లాయి. ఐతే.. మృతదేహాలను భద్రంగా ఉంచాలన్న సుప్రీంకోర్టు.. ఈ వ్యవహారాన్ని హైకోర్టే తేల్చిచెప్పాలని ఆదేశించింది.దీంతో చీఫ్ జస్టిస్ ఆర్ ఎస్ చౌహాన్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ కేసును విచారణ చేస్తోంది.ఈ క్రమంలో శుక్రవారం కోర్టులో విచారణకు హాజరైన గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రవణ్ కోర్టుకు హాజరై నాలుగు మృతదేహాల పరిస్థితిని కోర్టుకు వివరించారు.మైనస్ రెండు డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత ఉండే ఫ్రీజర్ లో నాలుగు మృతదేహాలను ఉంచామని, రకరకాల జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఫలితం లేకపోయిందని, శుక్రవారం ఉదయం నాటికి నాలుగు డెడ్ బాడీలు 50 శాతం కుళ్లిపోయాయని డాక్టర్ శ్రవణ్ తెలిపారు. వాటిని అలాగే ఉంచితే ఇంకో వారం పదిరోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయని చెప్పారు. వణ్ చెప్పిన సమాధానాల్ని విన్న జడ్జిలు… దేశంలో మరే ఇతర ఆస్పత్రిలోనైనా డెడ్ బాడీల్ని ప్రిజర్వ్ చేసే సౌకర్యాలు ఉన్నాయా? ఈ నాలుగు మృతదేహాలను అక్కడికి తరలించేందుకు వీలవుతుందా? అని ప్రశ్నించారు. అందుకు డాక్టర్ శ్రవణ్.. వేరే ఆస్పత్రుల్లో సౌకర్యాల గురించి తనకు తెలియదని జడ్జిలకు చెప్పారు. విచారణ కొనసాగుతున్న ఈ కేసుపై జడ్జిలు నిర్ణయాన్ని వెలువరించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos