బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్!

బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్!

 కాంగ్రెస్‌ పార్టీని దేశంలో భూస్థాపం చేస్తామంటూ ప్రకటించిన విధంగానే బీజేపీ పార్టీ అడుగులు వేస్తోందని కర్ణాటక జరిగిన రాజకీయ పరిణామాలను చూస్తే స్పష్టంగా తెలిసిపోతోంది.లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ గత ఎన్నికల కంటే స్పష్టమైన మెజారిటీ దక్కడంతో దేశంలో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాలను తమ వశం చేసుకోవడానికి బీజేపీ వ్యూహాలతో ముందుకు కదులుతోంది.ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం పది మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పుకొని గోవాలో అతిపెద్ద పార్టీగా అవతరించింది.ఇది జరుగుతున్న సమయంలోనే దక్షిణాదిలో అతిపెద్ద రాష్ట్రాల్లో ఒకటైన కర్ణాటక రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి తెర లేచింది.ప్రభుత్వంపై వ్యరేతికతతో కాంగ్రెస్‌-జేడీఎస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయగా ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు,ఒక బీఎస్పీ ఎమ్మెల్యే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్నారు.ఈ పరిణామాలతో బలపరీక్షకు పట్టుబట్టిన కమలనాథులు ఎట్టకేలకు మంగళవారం కుమారస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి అధికారాన్ని చేజిక్కుంచుకున్నారు.దీంతో దక్షిణాదిలో కాంగ్రెస్‌ అధీనంలో ఉన్న  ఒకేఒక్క రాష్ట్రమైన కర్ణాటక కూడా బీజేపీ వశమైంది.దీంతో కాంగ్రెస్‌ అధినంలో ఉన్న మరో పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్‌పై బీజేపీ అధిష్టానం కన్నేసినట్లు తెలుస్తోంది.మధ్యప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ నేత జీతూ పట్వారీ సైతం ఇదే అనుమానం వ్యక్తం చేస్తునవ్నారు. కర్నాటక తమ వశం కావడంతో ఇప్పుడు కమలనాథులు మధ్యప్రదేశ్పై దృష్టి పెడతారని, తమ సర్కారుకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టాలో అన్ని రకాలు పెడుతుందని ఆరోపించారు. అయితే ఇక్కడున్నది కుమారస్వామి ప్రభుత్వం కాదు.. కమల్నాథ్ ప్రభుత్వమన్న విషయాన్ని బీజేపీ గుర్తు పెట్టుకోవాలని జీతూ పట్వారీ వార్నింగ్ ఇచ్చారు.కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ నేత, మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం పతనమైతే అందుకు బీజేపీ ఎంతమాత్రం కారణం కాదని, అది కాంగ్రెస్ స్వయంకృతాపరాధమే అవుతుందని అన్నారు. అంతర్గత విబేధాలతో సతమతమవుతున్న కాంగ్రెస్ఎస్పీ, బీఎస్పీ దయాదాక్షిణ్యాలతో నడుస్తోందని కమల్నాథ్ విమర్శించారు. అంతర్గత విబేధాలు తారాస్థాయికి చేరి ఏదైనా జరిగితే అందుకు తాము బాధ్యులం కాదని అన్నారు. అయితే శివరాజ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు త్వరలోనే కాంగ్రెస్లో వర్గపోరు మొదలవుతుందనడానికి సంకేతాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నయి.230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి గతేడాది ఎన్నికలు జరిగాయి. అప్పట్లో కాంగ్రెస్ 114 స్థానాలు గెలుచుకోగా.. బీజేపీ 108 సీట్లు కైవసం చేసుకుంది. మేజిక్ ఫిగర్కన్నా ఒక సీటు తక్కువగా ఉండటంతో నలుగురు ఇండిపెండెంట్లు, ఇద్దరు బీఎస్పీ, ఒక ఎస్పీ ఎమ్మెల్యే మద్దతుతో కాంగ్రెస్ అధికారం చేపట్టింది. దీంతో అధికారం కోల్పోయిన బీజేపీ అప్పటి నుంచి కాంగ్రెస్ నుంచి మళ్లీ పాలనాపగ్గాలు చేజిక్కించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos