`బెంగాల్‌లో ఓడిపోతామని మోదీ-షాకు తెలుసు’

`బెంగాల్‌లో ఓడిపోతామని మోదీ-షాకు తెలుసు’

కోల్‌కతా: పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో బీజేపీ వెనకబడి ఉందని, అధికార తృణమూల్ కాంగ్రెస్ విజయపథంలో దూసుకుపోతుండటంతో బీజేపీ ‘మైండ్ గేమ్స్’ అడుతోందని టీఎంసీ నేత డెరిక్ ఒబ్రెయిన్ అన్నారు. బీజేపీ ఓటమి ఖాయమని తెలియడంతోనే వాళ్లు ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడుతున్నారని విమర్శించారు. ‘గత రాత్రి మోదీ-షా బెంగాల్‌పై సమీక్షా సమావేశం జరిపారు. టీఎంసీ దూసుకుపోతున్న విషయం వాళ్లకు తెలుసు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ కంటే మేము 3 శాతం ముందంజలో ఉన్నాం. ఈసారి అది 6 శాతానికి పెరిగింది. చాలా పెద్దపెద్ద మాటలు చెబుతున్న టూరిస్ట్ గ్యాంగ్ (బీజీపీ) వెనుకబడి ఉంది. ఆ కారణంగానే వాళ్లు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు’ అని ఒబ్రెయిన్ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో సీటు నుంచి పోటీ చేసే ప్రసక్తే లేదన్నారు. నందిగ్రామ్‌లో ఇప్పటికే ఆమె గెలుపొందారని చెప్పారు. ‘మేము నందిగ్రామ్‌లో నెగ్గేసాం. మరో నియోజకవర్గం ప్రసక్తే లేదు. ఇవన్నీ బీజేపీ మైండ్ గేమ్స్’ అని ఆయన అన్నారు. నందిగ్రామ్‌తో పాటు మరో నియోజకవర్గంలో పోటీ చేసేందుకు టీఎంసీ చీఫ్ చూస్తున్నారంటూ ప్రధాని మోదీ ఇటీవల వ్యాఖ్యానించగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం శుక్రవారం ఇవే వ్యాఖ్యలు చేశారు. బీజేపీ వాదనను టీఎంసీ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos