ఆ హీరోయిన్ల చేతుల మీదుగా ఎలిమినేషన్..

  • In Film
  • November 3, 2019
  • 136 Views
ఆ హీరోయిన్ల చేతుల మీదుగా ఎలిమినేషన్..

వంద రోజుల పాటు సాగిన బిగ్‌బాస్‌ మూడవ సీజన్ నేటితో ముగియనుంది.ఈ రోజు సాయంత్రం విజేతను ప్రకటించే ఫైనల్ ఎపిసోడ్ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమానికి సంబంధించి అన్ని విషయాలు ముందు లీకయ్యాయి.నలుగురు హీరోయిన్లతో పాటు మెగాస్టార్ చిరంజీవి ముఖ్యఅథిధిగా హాజరు కానున్నట్లు తెలుస్తోంది.ఇక టాప్ ఫైవ్‌లో నలుగురిని నలుగురు హీరోయిన్లు ఎలిమినేట్ చేయనున్నారు. సోషల్ మీడియాలో షికారు చేస్తున్న సమాచారం మేరకు బిగ్‌బాస్‌ కంటిస్టెంట్ అలీ రెజాను హీరోయిన్ రాశి ఖన్నా ఎలిమినేట్ చేస్తుందని తెలిసింది. అలాగే మరో హీరోయిన్ అంజలి చేతుల మీదుగా బాబా భాస్కర్ ఎలిమినేషన్ జరుగుతుందని తెలిసింది. ఇక ఎలిమినేషన్ జాబితాలో వరుణ్ సందేశ్ పేరు మొదటి ఉంటుందని సమాచారం. రాహుల్ సిప్లిగంజ్ బిగ్‌బాస్‌ సీజన్ 3 విజేతగా నిలిచాడని తెలుస్తోంది. చివరి వరకు ఉత్కంఠగా నిలిచిన పోరులో శ్రీముఖిని పడగొట్టి రాహుల్ విజేతగా నిలిచాడని లీక్ బయటకొచ్చింది. ఓటింగ్‌లో హోరాహోరీగా పోటీ పడిన శ్రీముఖి చివరకు రన్నరప్ గానే నిలవాల్సి వచ్చిందని టాక్ నడుస్తోంది.అయితే సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బిగ్‌బాస్‌ హోస్ట్‌ కింగ్‌ నాగార్జున స్పందించారు. బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 3 ఒక అద్భుతమైన ప్రయాణమని చెప్పారు. బిగ్‌బాస్‌ విన్నర్‌పై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దు అని కోరారు. విజేత ఎవరనేది సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమం చూసి తెలుసుకోవాలని అన్నారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos