కమలానికి గెలుపు గుర్రాల కొరత

కమలానికి గెలుపు గుర్రాల కొరత

కోల్కతావచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కంచుకోట పశ్చిమ బంగపై కాషాయ ధ్వజాన్ని ఎగరేస్తామని భాజపా
జాతీయ నేతలు విపరీతంగా ప్రచారాన్నిచేస్తుండగా ఆ పార్టీ పశ్చిమ బంగ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ వైఖరి అందుకు వ్యతిరేకంగా ఉంది. గెలిచే సామర్థ్యం ఉన్న అభ్యర్థులు తమకు తగినంత మంది లేదని చేసిన వ్యాఖ్య  కమలనాధులకు పిడుగు పాటైంది. ‘కష్టపడి పనిచేసే పార్టీ నేతలు, కార్యకర్తలు మాకు న్నారు. పంచాయతీ, అసెంబ్లీ ఎన్నికల్లో వారిని నిలబెట్టాం. అయితే లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి తగిన సామ ర్థ్యాన్ని కలిగిన  అభ్యర్థులు మాకు తగినంత మంది లేర’ని పేర్కొన్నారు. ఇతర పార్టీల నాయకుల చేరికతో పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నారనే వాదనల్ని
కొట్టి పారేసారు. పార్టీలో చేరి అభివృద్ధి కార్యక్రమాల్లో
పాలు పంచుకుంటామని ఎవరైనా ముందుకు వస్తే వారిని ఎలా కాదన గలమని ఎదురు ప్రశ్న వేసారు. ఇటీవల  తృణమూల కాంగ్రెస్‌,  కాంగ్రెస్, సీపీఎంకు చెందిన పలువురు ఎన్నికైన ప్రతినిధులు బీజేపీలో చేరారు. పశ్చిమ బంగలోని
42 లోక్‌సభ నియోజకవర్గాల్లో కనీసం 23 నియోజక వర్గాల్లో
విజయానిమన సాధించాలనేది పార్టీ
 జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆశయం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos