ఎలుగుబంటికి మస్కా కొట్టి తప్పించుకన్నాడు..

ఎలుగుబంటికి మస్కా కొట్టి తప్పించుకన్నాడు..

ఆపదలు,అవసరాలు మనిషిలో నిద్రాణస్థితిలో ఉన్న మెళకువలను,ప్రతిభను తట్టిలేపుతాయనొ ఓ కుర్రాడు వెనుక దాడి చేయడానికి సిద్ధమైన ఎగులుబంటి నుంచి తప్పించుకున్న తీరుతో మరోసారి రుజువైంది.ఇటలీలోని ఓ ప్రాంతంలో అలెశాండ్రో అనే ఓ 12 ఏళ్ల బాలుడు గ్రంథాలయం నుంచి ఇంటికి వెళుతున్నాడు.దారి మధ్యలో చెట్ల పొదలు దాటుతున్న సమయంలో ఓ భారీ ఎలుగుబంటి బాలుడిని వెనుకవైపు వెంబండించసాగింది.ఇది గమనించిన బాలుడు అంతకుముందు క్రూరమృగాలు తారసపడితే ఎలా తప్పించుకోవాలో పుస్తకాల్లో రాసిన సూచనలు గుర్తు చేసుకొని వాటిని అనుసరించి తెలివిగా ఎలుగుబంటి నుంచి తప్పించుకున్నాడు. వెంటనే తాను చదివిన పుస్తకంలో మాదిరిగా ప్రొఫెషనల్గా మెల్లగా నడుస్తూ ఎలాంటి ఒత్తిడికి లోనవకుండా నడుస్తూ వచ్చాడు. పిల్లాడిపై ఎలుగుబంటి దాడిచేయడం ఖాయం అనుకొంటుండగా.. కొద్ది దూరం అలాగే వెంబడించిన ఎలుగుబంటి.. కొద్దిసేపటి తర్వాత తన దిశ మార్చుకొని మరోవైపు వెళ్లిపోయింది. వీడియోను లోరిస్కాలియారి అనే వ్యక్తి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అలెశాండ్రో ధైర్యంగా నడుచుకుంటూ వచ్చిన సమయంలో తానే సాక్షిగా ఉన్నానని, వీడియోను ఇటలీలోని ప్రసిద్ధ హైకింగ్స్పాట్అయిన స్పోర్మినోర్వద్ద తీసినట్లు లోరిస్కాలియారి చెప్పారు. వీడియో ఇప్పుడు సోషల్మీడియాలో వైరల్గా మారింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos