ఇండియా చెత్త బ్యాటింగ్ ఎప్పుడెప్పుడంటే…

ఇండియా చెత్త బ్యాటింగ్ ఎప్పుడెప్పుడంటే…

హామిల్టన్‌: వన్డేల్లో మూడు ద్విశతకాలు చేసిన ఆటగాళ్లున్న ఘనత టీమిండియాది. అలాంటిది కొన్ని వన్డేల్లో కనీసం 100 పరుగులు కూడా పూర్తి చేయకుండా ఆలౌటైన సందర్భాలున్నాయి. గురువారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డే కూడా అలాంటిదే. జట్టు స్కోరును 92 పరుగుల వరకు తీసుకురావడానికి బ్యాట్స్‌మెన్ చాలా కష్టపడాల్సి వచ్చింది. ఎలాంటి బౌలింగ్‌నైనా ఎదుర్కొని క్రీజులో కుదురుకునే లక్షణమున్న టీమిండియాను కివీస్‌ బౌలర్లు ముప్పుతిప్పలు పెట్టించారు. మరి ఇలాంటి సందర్భాలు వన్డేల్లో భారత జట్టుకు ఎప్పుడెప్పుడు ఎదురయ్యాయో చూసుకుంటే…

* 2000 సంవత్సరంలో షార్జా వేదికగా శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 54 పరుగులకే కుప్పకూలింది.

* 1981లో ఆస్ట్రేలియాతో సిడ్నీ లో జరిగిన మ్యాచ్‌లో 63 పరుగులకు భారత జట్టు ఆలౌట్‌ అయింది. 

* కాన్పూర్‌ వేదికగా 1986లో శ్రీలంకతో జరిగిన వన్డేలో టీమిండియా 78 పరుగులకే ఇంటి ముఖం పట్టింది.

* 1978లో సియాల్‌కోట్‌ స్టేడియంలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు కేవలం 79 పరుగులు మాత్రమే చేయగలిగింది.

* 2010లో దంబుల్లా వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన వన్డేలో టీమిండియా 88 పరుగులకే ఆలౌటైంది.

* 2006లో డర్బన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారతజట్టు 91 పరుగులకే కుప్పకూలింది.

* ప్రస్తుతం హామిల్టన్‌ వేదికగా జరిగిన వన్డేలో టీమిండియా 92 పరుగులకే బ్యాట్స్‌మెన్‌ అందరూ పెవిలియన్‌కు చేరుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos