అంబటి రాయుడి బౌలింగ్ నిషేధం

అంబటి రాయుడి బౌలింగ్ నిషేధం

దిల్లీ: భారత ఆటగాడు అంబటి రాయుడి బౌలింగ్‌పై ఐసీసీ నిషేధం విధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో బౌలింగ్‌ చేయకుండా అతనిపై వేటు వేసింది. రాయుడి బౌలింగ్‌ అనుమానాస్పదంగా ఉందని ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో బౌలింగ్‌ యాక్షన్‌కు సంబంధించిన పరీక్షకు హాజరుకావాల్సిందిగా ఐసీసీ ఆదేశించింది. అయితే నిర్ణీత 14 రోజుల్లో అతను హాజరుకాకపోవడంతో ఐసీసీ చర్యలకు ఉపక్రమించింది. ఐసీసీ నిబంధనల్లోని 4.2 క్లాజ్‌ ప్రకారం అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో బౌలింగ్‌ చేయకుండా అతనిపై నిషేధం విధించింది. రాయుడు బౌలింగ్‌ శైలిని పరిశీలించి.. సక్రమంగానే బౌలింగ్‌ చేస్తున్నాడని నిర్ధారించే వరకూ ఈ సస్పెన్షన్‌ కొనసాగుతుందని ఐసీసీ స్పష్టం చేసింది. సిడ్నీలో ఈ నెల 13న ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో అంబటి రాయుడి బౌలింగ్‌ శైలిపై ఫిర్యాదు అందింది. అయితే బీసీసీఐ నిబంధనల ప్రకారం దేశవాళీ క్రికెట్‌లో‌ అతను బౌలింగ్‌ కొనసాగించే అవకాశముంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos