జూ.ఎన్టీఆర్‌పై బాలకృష్ణ అల్లుడి సంచలన వ్యాఖ్యలు..

జూ.ఎన్టీఆర్‌పై బాలకృష్ణ అల్లుడి సంచలన వ్యాఖ్యలు..

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.తెలంగాణలో పూర్తిగా ఉనికినే కోల్పోగా ఆంధ్రప్రదేశ్‌లో ఉనికి కాపాడుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది.ముఖ్యంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడుకు వయసు మీద పడడంతో వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించే నాయకుడి కోసం తెదేపా శ్రేణులు ఆశగా ఎదురుచూస్తున్నాయి.చంద్రబాబు వారసుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించిన నారా లోకేశ్‌ అన్ని విషయాల్లోనూ పూర్తిగా తేలిపోవడంతో తెదేపా శ్రేణులు జూ.ఎన్టీఆర్‌పై ఆశలు పెంచుకుంటున్నాయి. ఈ తరుణంలో నారా లోకేష్ తోడల్లుడు.. బాలయ్య రెండో అల్లుడు అయిన భరత్ ఇదే విషయంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‘చంద్రబాబుబాలయ్యలోకేష్మేమంతా ఉన్నాం కదా.. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీకి అవసరం లేదుఅని హాట్ కామెంట్ చేశారు. ఇప్పుడీ మాటలు వైరల్ అయ్యాయి.లోకేష్ కు పోటీవస్తాడనే జూనియర్ ను దూరం పెట్టారన్న విమర్శలు వచ్చినా దగ్గరకు తీయలేదు.అయితే తాజాగా బాలయ్య చిన్నల్లుడు భరత్ మాటలు టీడీపీలో మంటలు పుట్టించాయి… ‘టీడీపీకి చరిష్మా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ లాంటి నేతలు అవసరం లేదుఅని కామెంట్ చేశారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బాగుపడుతుంది.ఎన్టీఆర్‌తో పార్టీ గెలుస్తుందని తాను అనుకోవడం లేదని పార్టీకి జవసత్వాలు నింపే సామర్థ్యం ఉందని భావించడం లేదంటూ జూనియర్ పై కామెంట్ చేశారుతెలుగు దేశం పార్టీయే సుప్రీం అని.. ఒక్క జూనియర్ ఎన్టీఆర్ ఎంత పెద్ద స్టార్ పాపులర్ అయినా మార్పు రాదని..  పార్టీకి జూనియర్ అవసరం లేదని.. చంద్రబాబులోకేష్ టీడీపీ నేతలు చాలు అని స్ఫష్టం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ తోనే పార్టీ బాగుపడుతుందని తాను నమ్మడం లేదని పేర్కొన్నారు. కాగా జూనియర్ ఎన్టీఆర్ ను తీసిపారేసినట్టు బాలయ్య అల్లుడు మాట్లాడిన తీరుపై నందమూరి ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు. కనీసం ఎంపీగా కూడా గెలవలేని బాలయ్య అల్లుడు భరత్ జూనియర్ పై కామెంట్ చేయడం ఏంటని సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos