బెయిల్‌ కోసం చిదంబరం మొర

బెయిల్‌ కోసం చిదంబరం మొర

న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో బెయిల్ మంజూరు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గురువారం అత్యున్నత న్యాయస్థానానికి విన్నవించారు. ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నిందితుడైన ఆయన్ను సీబీఐ గత ఆగస్టు 21న అరెస్టు చేసింది. న్యాయ స్థానం జ్యూడీ షియల్ కస్టడీ విధించింది . తిహార్ చెరసాల్లో బంధీగా ఉన్న ఆయన బెయిల్ మంజూరుకు సోమ వారం ఢిల్లీ ఉన్నత న్యాయ  స్థానాన్ని కోరారు.
చిదంబరం విడుద లైతే సాక్షులను ప్రభావితం చేస్తారని సీబీఐ చేసిన ఆక్షేపణతో న్యాయస్తానం ఏకీభవించి బెయిలు మంజూరుకు నిరాకరించింది. దరిమిలా ఆయన అత్యున్నత న్యాయస్థానానికి విడుదల మొర పెట్టుకున్నాడు.వ్యాజ్యాన్ని విచారణకు స్వీకరించిన ఎన్.వి. రమణ నేతృత్వంలోని ధర్మాసనం బెయిల్మంజూరు చేయాలో వద్దో ప్రధాన న్యాయమూర్తి రంజన్ గోగోయ్ ప్రకటిస్తారని తెలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos