సీఎం తండ్రి అరెస్ట్

సీఎం తండ్రి అరెస్ట్

రాయ్పూర్: బ్రాహ్మణులపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణపై ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ మంగళవారం అరెస్టయ్యారు. ఇక్కడి న్యాయ స్థానం ఆయనకు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించింది. బ్రాహ్మణులకు వ్యతిరేకంగా ఉత్తర్ప్రదేశ్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు బ్రాహ్మణులు చేసిన ఫిర్యాదు ప్రకారం రాయ్పుర్లోని దీన్దయాల్ పోలీస్ స్టేషన్లో నందకుమార్పై కేసు నమోదైంది. ‘చట్టానికి ఎవరూ అతీతులు కారు. నా తండ్రి తప్పు చేసినట్లు ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాన’ని భూపేశ్ బఘేల్ స్పందించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos