పవన్‌ ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్‌ రాజ్‌ సైడా?

పవన్‌ ఇండస్ట్రీ సైడా? ప్రకాశ్‌ రాజ్‌ సైడా?

హైదరాబాదు: ‘పవన్ కల్యాణ్ అన్ని మాటలు మాట్లాడారు. ఇంతకి ఆయన పరిశ్రమ సైడా? ప్రకాశ్ రాజ్ సైడా? ముందుగా పవన్ కల్యాణ్ తేల్చుకోవాల’ని బాబు మోహన్ ఒక యూట్యూబ్ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ సర్కారు సహకారం ఇండస్ట్రీకి అవసరం. ప్రభుత్వాన్ని ఇండస్ట్రీయే ఓ విషయాన్ని అడిగింది. దీనిపై పవన్ కల్యాణ్ ఏదేదో మాట్లాడారు. ఈ విషయంలో పవన్ వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఏదేమైనా తెరచాటునే అన్ని విషయాలు తేల్చుకోవాలి. అంతేగాని తెర ముందుకు వచ్చి మాట్లాడటం ఏంటి? మరి అంత చిరాకుతో మాట్లాడటం ఎందుకు? చక్కగా నవ్వుతూ మాట్లాడుకోవచ్చు కదా. వ్యక్తిగతం విమర్శలు చేయడం వల్ల మన పరిశ్రమ పరువే పోతుంది. అంత పెద్ద అన్యాయమే జరిగితే పెద్ద మనుషులతో మాట్లాడాలి తేల్చుకోవాల’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos