బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్‌

బాబు హయాంలో అప్పుల తప్పులు: కాగ్‌

అమరావతి: చంద్రబాబు సర్కారు ఐదేళ్ల పాలనలో చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వ్యయం చేయకుండా ఇతర అవసరాలకు వినియోగించింది. దీంతో అప్పులు పెరిగిపోయాయి తప్ప ఆస్తుల కల్పన తగ్గిపోయిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక చూపింది. 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు ప్రభుత్వం చేసిన అప్పుల్లో ఆస్తుల కల్పనకు ఎంత వ్యయం చేసిందనే వివరాలను కాగ్ నివేదిక వెల్లడించింది. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు చేయడం వాటిని ఆస్తుల కల్పనకు కాకుండా ఇతర రంగాలకు మళ్లించింది. 2014–15లో అయితే చేసిన అప్పుల్లో సగం కూడా ఆస్తుల కల్పనకు వ్యయం చేయలేదని స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos