చిన్నారికి ఫోన్ ఇచ్చినందుకు షాక్.

చిన్నారికి ఫోన్ ఇచ్చినందుకు షాక్.

న్యూజెర్సీ : పిల్లల అల్లరి తట్టుకోలేక చాలా మంది తల్లిదండ్రులు వారికి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసి వారి పనుల్లో వారు మునిగి పోతుంటారు. ఇలాంటప్పుడు కొన్ని ఊహించనవి కూడా జరుగుతాయి. ఇక్కడి ప్రమోద్ కుమార్, మధు దంపతుల కుమారుడి పేరు అయాన్ష్( 22 నెలలు). ఫోన్ లో వీడియో గేమ్స్ ఆడుకోవడం, యూట్యూబ్ వీడి యో లకు పరిమితం కాలేదు. వాల్ మార్ట్ షాపింగ్ యాప్ తెరిచి, కార్ట లో వున్నవన్నీ ఆర్డర్ చేసేశాడు. వాటి విలువ మన కరెన్సీలో చూస్తే 1.4 లక్షలు. ఒక రోజు పెద్ద వాహనం ప్రమోద్ కుమార్ ఇంటి ముందు ఆగింది. ఒక్కొక్కటిగా వారు పెద్ద పెద్ద అట్ట పెట్టెలు డెలివరీ చేస్తున్నారు. దీంతో మధు తన ఫోన్ లో వాల్ మార్ట్ ఆర్డర్లను చెక్ చేసింది. అందులో తను ఇటీవల కొన్ని ఫర్నిచర్ వస్తువుల్ని ఎంపిక చేసి కార్ట్ లో సేవ్ చేసింది. వాటిని ఆర్డర్ చేసినట్టు అందులో కనిపించింది. దీంతో తాను చేయకుండా, ఎవరు ఈ పని చేశారో ఆమెకు మొదట అర్థం కాలేదు. ఆ తర్వాత తమ అల్లరి కొడుకే ఈ పనిచేసినట్టు తెలుసుకుంది. ముందు షాక్ అయినా.. తర్వాత తేరుకుని ‘వార్నీ .. ఇంతపని చేశావా?’ అంటూ ఆనందంతో డెలివరీ అయిన బాక్స్ లపై అయాన్ష్ ను కూర్చోబెట్టి ఫొటో తీశారు.‘చిన్నారి ఈ పని చేశాడంటే నమ్మడానికే కష్టంగా ఉంది. కానీ ఏం జరిగిం దో?’ అంటూ ప్రమోద్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. నిజానికి షాపింగ్ కార్ట్ లో యాడ్ చేసినవన్నీ కొనుగోలు చేయడానికి కాదు. తర్వాత వాటిల్లో కొన్నింటిని ఎంపిక చేసి కొత్త ఇంటికోసం తెప్పించుకుందామని చిన్నారి తల్లి మధు అనుకుంది. ఏదైతేనేమి ఫోన్ ఇచ్చినందుకు తల్లిదండ్రులకు శ్రమ లేకుండా చేశాడు చిన్నారి. మరోసారి జాగ్ర త్తగా ఉండాలన్న హెచ్చరిక కూడా తన చర్యతో పంపాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos