బంగారం ధర తగ్గు ముఖం

బంగారం ధర తగ్గు ముఖం

ముంబై: ప్రపంచ విపణిలో పసిడి ధర గురువారం బాగా పతనమైంది. దేశీయంగానూ పసిడి ధర తగ్గుముఖం పట్టింది. ఎంసీక్స్‌ ట్రేడింగ్‌లో జూన్‌ ఫ్యూచర్‌ కాంటాక్టు 10 గ్రాముల పసిడి ధర రూ.313 లు నష్ట పోయింది. డాలర్‌ మారకంలో రూపాయి స్వల్పంగా బలపడటం ఇందుకు కారణవుతోంది. హైదరాబాద్‌లో 24 కారెట్ల పుత్తడి ధర 50 రూపాయలు క్షీణించి రూ.31,963 వద్ద, 22 కారెట్ల ధర రూ.30433 వద్ద వుంది. ఆసియాలో ఉదయం ఔన్స్‌ పసిడి ధర 8.75డాలర్లు నష్టపోయి1,275.45 వద్ద ట్రేడయ్యింది. ఆసియా మార్కెట్లో ఇన్వెస్టర్లు పసిడి ఫ్యూచర్ల అమ్మకాలకు తెరలేపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos