తమిళనాట భాజపాకు దెబ్బ

తమిళనాట భాజపాకు దెబ్బ

చెన్నై:తమిళనాడులో భాజపాకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు బీటీ అరసకుమార్ ఆ పార్టీకి రాజీనామా చేసి డీఎం కే లో చేరారు. అన్నా అరివాలయానికి వెళ్లిన అరసకుమార్ ఆ పార్టీ అధ్యక్షుడు స్టాలిన్తో భేటీ అయ్యారు. తర్వాత డీఎంకే లో చేరనున్నట్లు ప్రకటించారు. ‘20 ఏళ్ల తరువాత తిరిగి సొంత గూటికి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. డీఎంకే కుటుం బ సభ్యు నిగా నన్ను చేర్చుకున్నందుకు స్టాలిన్కు ధన్యవాదాలు. నేను స్టాలిన్ గురించి మాట్లాడినప్పటి నుంచి భాజపా కార్య క ర్తలు, నాయకులు నన్ను అసభ్య పదజాలంతో దూషించడం మొదలుపెట్టారు. నేను నిజాన్నే మాట్లాడాను. ప్రపం చంలోని తమిళులకు స్టాలిన్ రక్షకుడిగా ఉంటారు. తమిళనాడు భాజపా కొందరు నాపై కక్ష పెంచుకున్నారు. నేను ఈ రోజు పార్టీని వీడ టంతో వారు సంతోష పడుతున్నారు. వారి సంతోషం కొంతకాలమే. రాబోయే కొన్ని నెలల్లో తమిళనాడు రాజకీ యాల్లో పెను మా ర్పు లు చోటు చేసుకోనున్నాయి. తమిళులు స్టాలిన్ నాయక త్వాన్ని కోరుకుంటున్నార’ని తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos