భూమికి చేరువుగా రానున్న గ్రహ శకలం

భూమికి చేరువుగా రానున్న  గ్రహ శకలం

వాషింగ్టన్ : 4,500 అడుగుల వెడల్పైన గ్రహ శకలం – 2016 ఏజే193 శనివారం గంటకు 94,208 కి.మీ వేగంతో భూమికి చేరువుగా రానున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ -నాసా తెలిపింది. ఇది అత్యంత ప్రమాదకరమైన అంతరిక్ష శిల అయినా దీని వల్ల హాని ఉండదని తెలిపింది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అప్పుడు గ్రహ శకలానికి, భూమికి మధ్య ఉన్న దూరం భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరం కంటే తొమ్మిది రెట్లు ఎక్కువ. ఇది మళ్లీ 2063లో భూమికి దగ్గరగా రానుంది. వస్తుందన్నారు. 2016 జనవరిలో హవారులోని పాన్-స్టార్స్ అబ్జర్వేటరీ సాయంతో దీన్ని గుర్తించారు. నాసా కుచెందిన నియోవైస్ అనే వ్యోమనౌక నిశితంగా పరిశీలించింది. ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుంది. ఆగస్ట్ 21న భూమికి దగ్గరగా వచ్చిన ఈ గ్రహ శకలం 65 ఏళ్ల అనంతరం భూమికి దగ్గరగా వస్తుందని అన్నారు. ఇది నల్లగా ఉండటంతో కాంతి పరావర్తనం చెందడంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. అంతరిక్షంలో మిగిలి ఉన్న రాతి శకలాలను గ్రహ శకలాలు అంటారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos