కౌలు రైతులకూ భరోసా

కౌలు రైతులకూ భరోసా

అమరావతి: కౌలు రైతులకూ భరోసా పథకాన్ని అమలు చేయనున్నట్లు వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షుడు నాగిరెడ్డి శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ఇందుకు అవసరమైతే చ ట్టాన్ని సవరిస్తామన్నారు. ప్రతినెలా వ్యవసాయ మిషన్ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. రూ.మూడు వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామన్నారు. పెట్టుబడి రాయితీ, విత్తనాల లోటు లేకుండా ప్రణాళికలు చేపట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. పగలు తొమ్మిది గంటలు నిరంతరాయ విద్యుత్ కోసం రూ.1700 కోట్లు ఖర్చుతో 60 శాతం ఫీడర్లను ఆధునీకరించనున్నట్లు తెలిపారు. రైతు సహకార సంఘాల, సాగు నీటి వినియోగదారుల సంఘాల ఎన్నికలు కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. భూ దాఖలాల సవరణ చేపట్టాల్సి ఉందన్నారు. విత్తనాల కొరత నివారించాలని, విత్తనాల నాణ్యత పరీక్ష కోసం ప్రయోగ శాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపారు. తొలుత ముఖ్యమంత్రి జగన్మోన రెడ్డి నిర్వహించిన వ్యవసాయ శాఖ సమీక్షలో నాగి రెడ్డి పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos