ఆసీస్‌ను తక్కువ అంచనా వేయకండి!

  • In Sports
  • January 11, 2019
  • 184 Views
ఆసీస్‌ను తక్కువ అంచనా వేయకండి!

ముంబయి: ఆసీస్‌తో జగబోయే మూడు వన్డేల సిరీస్‌ కోసం కోహ్లీసేన తీవ్రంగా సాధన చేయాలని మాజీ క్రికెటర్‌‌ అనిల్‌ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ఆ జట్టును తక్కువ అంచనా వేయొద్దని సూచించాడు. ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌ శనివారం నుంచి ప్రారంభం కానుంది.

‘చారిత్రక టెస్టు సిరీస్‌ను గెలిచిన కోహ్లీసేనపై మరో బాధ్యత కూడా ఉంది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పుడు బలహీనంగా ఉంది. అలాగని వారిని తేలిగ్గా తీసుకోలేం. మనం చేసే ప్రయత్నం మనం చేయాలి. వన్డేలకు ఇంకాస్త సమయం దొరికితే బాగుండేంది. అంతేకాకుండా క్రీజులో కుదురుకోవడానికి కొంత సమయం తీసుకునే ఆటగాళ్లు కూడా జట్టులో ఉన్నారు. అలాగని వారిని, వారి ప్రతిభను తక్కువ అంచనా వేయలేం. ప్రత్యర్థి జట్టు బలహీనంగా ఉందని తక్కువగా అంచనా వేస్తే మనం బలం కోల్పోయే ప్రమాదం ఉంది. ఇక ఆటగాళ్ల విషయానికొస్తే రిషబ్‌పంత్‌ను మూడు ఫార్మాట్లలోనూ తీసుకోవాలి. ఇప్పుడు కోహ్లీ సేన వేసే ప్రతి అడుగు ముఖ్యమైనదే. ప్రతి మ్యాచ్‌ ప్రపంచకప్‌కు ఉపయోగపడుతుంది’ అని కుంబ్లే అన్నాడు.

ధోనీ సామర్థ్యాలు గురించి తెలీదా?: ‘మహేంద్ర సింగ్ ధోనీ విషయంలో ఇప్పటికీ కొందరికి కొన్ని అనుమానాలున్నాయి. కొన్ని మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రాన అతడి ప్రతిభను పూర్తిగా పక్కన పెట్టి మాట్లాడటం సరికాదు. ప్రపంచ కప్‌లో ధోనీకి స్థానం ఉంటుందని ఆశిస్తున్నా. ఇదే మాట కొద్ది రోజుల క్రితం చెప్పాను. ఇప్పుడూ చెప్తున్నా. ధోనీ సామర్థ్యం గురించి అందరికీ తెలుసు. దేశానికి ప్రపంచకప్ సాధించి పెట్టిన ఘనత తనది. ధోనీ మీద విమర్శలు చేయడం కూడా మానుకోవాలి’ అని కుంబ్లే అన్నాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos