కరుడు కట్టిన ఉగ్రవాది అసిఫ్ హతం

కరుడు కట్టిన ఉగ్రవాది అసిఫ్ హతం

న్యూఢిల్లీ : బారముల్లా జిల్లాలో బుధవారం జరిగిన ఎదురు కాల్పుల్లో లష్కరే తోయిబా ఉగ్రవాది ఆసిఫ్ మక్బూల్ భట్ హతమయ్యాడు. ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అసిఫ్ ప్రయాణించిన కారును తనిఖీ కేంద్రం వద్ద పోలీసులు నిలిని తనిఖీకి ప్రయత్నించారు. తను కారు ఆపకుండా దూసుకె ళ్ళాడు. దీంతో బలగాలు వెంబడించారు. అసిఫ్ వారిపై కాల్పులు జరిపాడు. తదుపరి పరస్పర కాల్పుల్లో అసిఫ్ మృతి చెందాడు. ఉగ్రవాదులు ఈ నెల 7న పండ్ల వ్యాపారి అరార్షద్ రాథర్ ఇంటిపై దాడి చేసినపుడు ఆ వ్యాపారి, ఆయన మనవరాలు ఐదేళ్ళ అస్మా జాన్, మరో ఇద్దరు గాయ పడ్డారు. సోపోర్లోని పండ్ల మార్కెట్లో దుకాణాలను తెరిచినందుకు వారిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. గాయపడిన జవానులిద్దరూ క్షేమంగా ఉన్నారని జమ్ము-కాశ్మీర్ డిజిపి దిల్బాగ్ సింగ్ ఇక్కడ విలేకరులకు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos