నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఖాయం

నిర్భయ దోషులకు ఉరి శిక్ష ఖాయం

న్యూ ఢిల్లీ : నిర్భయకు న్యాయం జరిగి తీరుతుందని ఆమె తల్లి ఆశాదేవి విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘దోషులు ఎన్నో సాకులతో తమ శిక్షను వాయిదా వేసిన ఎత్తు గడలు కోర్టుకు తెలిసాయి. ఇక శిక్ష నుంచి వారు తప్పించుకోలేరన్నారు. నిర్భయకు రేపు తప్పకుండా న్యాయం జరుగి తీరుతుంద’ని నమ్మకంగా చెప్పారు. ఈ కేసులో దోషి పవన్ గుప్తా దాఖలు చేసిన క్యురేటివ్ పిటిషన్ను గురువారం సర్వోన్నత న్యాయ స్ధానం తోసి పుచ్చింది. 2012లో నిర్భయ ఘటన జరిగిన సమయంలో తాను మైనర్నని, దిగువ కోర్టులు ఈ వాస్తవాన్ని విస్మరించాయని తన పిటిషన్లో పవన్ పేర్కొన్నారు. నేరం జరిగినప్పుడు తాను మైనర్ను కావడంతో తనకు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షకు మార్చాలని ఆయన కోరారు. అంతకుముందు ఇదే వాదనతో పవన్ గుప్తా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను కోర్టు తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. దోషులకు ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడిన ఉరి శిక్ష, ఈ నెల 20న తెల్లవారు జామున 5:30 గంటలకు ఖరారైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos