ఆయన చింతమడక సీఎం కాదుగా…

ఆయన చింతమడక సీఎం కాదుగా…

హైదరాబాద్ : తన స్వగ్రామం సిద్దిపేట జిల్లా చింతమడకలో ఒక్కో ఇంటికి రూ.10 లక్షల లబ్ధి చేకూరుస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ అనడం సరికాదని భాజపా నాయకురాలు డీకే అరుణ అన్నారు. చింతమడకలా ఎన్ని గ్రామాలను అభివృద్ధి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేటకు మాత్రమే వేల కోట్ల నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. ఎంపీగా గెలిపించిన పాలమూరును కేసీఆర్ ఎందుకు అభివృద్ధి చేయలేదని ప్రశ్నించారు. చాలా మందికి రైతుబంధు సొమ్మే అందలేదన్నారు. నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఏనాడూ పట్టించుకోలేదని విమర్శించారు. కేసీఆర్ కేవలం చింతమడక ప్రజలకే సీఎం కాదని, అన్ని గ్రామాలనూ సమానంగా అభివృద్ధి చేయాలని ఆమె కోరారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos