ఇంటర్య్వూలు లేకుండానే ఉద్యోగుల ఎంపిక

ఇంటర్య్వూలు లేకుండానే ఉద్యోగుల ఎంపిక

అమరావతి: ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టే ఉద్యోగ నియమాకాల్లో అభ్యర్థుల ఇంటర్య్వూను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం తీర్మానించింది. దీన్ని వచ్చే జనవరి నుంచి అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి ఉన్నతాధికార్లను సూచించారు. ఉద్యోగాలకు నిర్వహించే పరీక్షల నిర్వహణ లోటుపాట్లు లేకుండా, పారదర్శకం చేయాలని ఆదేశించారు. ఏటా జనవరిలో ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టే వేళలు, ఇతర వివరాల్ని ప్రకటిం చాలని కూడా చెప్పారు. పరీక్షల నిర్వహణకు ఐఐటీ, ఐఐఎం సాయాల్ని కూడా తీసుకోవాలనే యోచన ఉందని తెలిపారు. ఉద్యోగ ఖాళీల భర్తీలో తొలుత అత్యవసర విభాగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos