వైరి వర్గాల మధ్య సయోధ్య

వైరి వర్గాల మధ్య సయోధ్య

జైపూర్: అశోక్ గహ్లోత్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ప్రయత్నించిన సచిన్ పైలట్ వర్గం ఎట్టకేలకు రాజీకి వచ్చినట్లు తెలుస్తోంది. పైలట్ వర్గంతో కాంగ్రెస్ అధిష్టానం జరుపుతున్న చర్చలు సానూకూల స్పందన లభిస్తున్నట్లు పార్టీ వర్గాల కథనం. చివరగా ప్రియాంక గాంధీ, సచిన్ల భేటీతో ఈ చర్చలు కొలిక్కి వస్తాయని అంచనా. తిరుగుబాటు ఎమ్మెల్యేలు గహ్లోత్ ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తారని పేర్కొన్నాయి. ఈ వార్తలను పైలట్ వర్గం ఖండించింది. గహ్లోత్ను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగిస్తేనే మద్దతుగా నిలుస్తామని తేట తెల్లం చేసింది. శాసనసభ సమావేశాలు ఆగస్టు 14 నుంచి ప్రారంభం కానున్నదశలో రెండు ఇరు వర్గాలు మధ్య చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలు తిరిగి వస్తే స్వాగతిస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. తిరుబాటు చేసిన 19 మంది ఎమ్మెల్యేల మద్దతు లేకుండానే విశ్వాస పరీక్షలో నెగ్గాలని గహ్లోత్ కూడా ఆలోచిస్తున్నారు. విశ్వాస పరీక్షలు మద్దతు ఇవ్వాలని ఎమ్మెల్యేలకు ఆదివారం లేఖలు రాశారు.‘సత్యం పక్షాన నిలవండి–ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయడానికి, ఓటర్ల అభిప్రాయాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకోండి’అని లేఖలో వ్యాఖ్యానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos