పాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ అడుగులు!

పాలనా వికేంద్రీకరణ దిశగా జగన్ అడుగులు!

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని అమరావతితో పాటు అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేవలం హైదరాబాద్‌ అభివృద్ధిపై మాత్రమే దృష్టి పెట్టడంతో అన్ని ప్రాంతాలు వెనుకబడ్డాయి.దీంతో రాష్ట్ర విభజన జరిగాక ఆంధ్రప్రదేశ్‌ ఏస్థాయిలో నష్టపోయిందో అందరికి తెలిసిన విషయమే.ఇటువంటి తప్పు పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో వైఎస్‌ జగన్‌ పాలనా వికేంద్రీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.ఈ క్రమంలో అమరావతిని పాలనపరమైన రాజధానిగా ఉంచుతూనే ప్రధాన సంస్థలను అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరించడానికి నిర్ణయించుకున్నట్లు సమాచారం.ముఖ్యంగా దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నరాయలసీమ..ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ ప్రభుత్వ సంస్థలను విస్తరించాలని ప్రభుత్వం యోచన చేస్తోంది. అందులో భాగంగా ఎంతో కాలంగా హై కోర్టును కర్నూలు లో ఏర్పాటు చేయాలనే ఆలోచనలో వైఎస్‌ జగన్‌ ఉన్నట్లు సమాచారం.దీంతో పాటుగా ఏపీ ఆర్దిక రాజధానిగా ఉన్న విశాఖను పూర్తిగా ఐటి హబ్ గా తీర్చిదిద్దాలని నిర్ణయించారు. ఐటీ పరిశ్రమను పూర్తగా అక్కడే ఏర్పాటు చేయనున్నారు. ప్రకాశం జిల్లాలో వెనుకబాటు తనం తగ్గించటానికి దొనకొండ లో పారిశ్రామిక హబ్ ఏర్పాటుకు నిర్ణయించారు. దేవాదాయ విభాగాలకు చెందిన అన్ని శాఖలు..అనుబంధ కార్యాలయాలను తరుపతికి తరలించి టెంపుల్ సిటీగా మార్చాలని ప్రణాళికలు సిద్దం అవుతున్నాయి. అధికార వికేంద్రీకరణ దిశగా బీజేపీ సైతం డిమాండ్ చేస్తూ వస్తోంది. రాయలసీమ లో సంస్థలు ఏర్పాటు చేయాలని కోరుతోంది. దీంతో..తాజా నిర్ణయాల ద్వారా బీజేపీ తమ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని ప్రాంతాల డెవలప్ మెంట్ నిర్ణయాల దిశగా సాగనుంది.ప్రస్తుతం అమరావతి గురించి రచ్చ సాగుతున్న సమయంలోనే ఇప్పుడు రాయలసీమ నుండి తమ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు చేయాలనే డిమాండ్ మొదలైంది. దీంతో..అన్ని ప్రాంతాల వారిలోనూ నిర్లక్ష్యం చేస్తారనే భావన రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగా త్వరలోనే దీనికి సంబంధించిన కార్యాచరణ ఖరారు చేసే అవకాశం ఉంది. ఇక, రాజధాని ప్రాంతంలో ముంపు ప్రాంతాలను తప్పించి..మిగిలిన ప్రాంతాల్లో నిర్మాణాలు చేసే అవకాశం కనిపిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos