అనుమానాలకు తావిస్తున్న దొనకొండలో భూసేకరణ..

అనుమానాలకు తావిస్తున్న దొనకొండలో భూసేకరణ..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని మార్పుపై రోజురోజుకు చర్చలు తీవ్రతరమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది.అమరావతి నుంచి రాజధానిని దొనకొండకు మారుస్తున్నారంటూ చర్చలు జరుగుతున్న సమయంలోనే దొనకొండలో 2,450 ఎకరాల భూమిని గుర్తించిన ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి అక్కడ కీలక నిర్ణయాలు అమలు దిశగా కార్యాచరణ సిద్దం చేస్తుండడం అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది.రాజధాని అంశం మీద అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నియమించిన శివరామక్రిష్ణన్ కమిటీ సైతం ప్రతిపాదించిన రాజధాని ప్రాంతాల్లో దొనకొండ ఒకటి. అయితే, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తుళ్లూరు ప్రాంతాన్ని రాజధానిగా ఖరారు చేసి అమరావతిగా పేరు ప్రకటించారు. ఇక, ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారి వైసీపీ అధికారంలోకి వచ్చింది. తాజాగా మంత్రి బొత్సా అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలతో వైసీపీ ప్రభుత్వం రాజధాని మార్పుపై తీవ్రంగా కసరత్తులు చేస్తున్నట్లు చర్చలు జరుగుతున్నాయి. అయితే దొనకొండ ప్రాంతాన్ని రాజధానిగా కాకుండా కేవలం పారిశ్రామిక హబ్గా చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని సమాచారం. ఇప్పటికే ఇక్కడ పారిశ్రామీకరణ కోసం దాదాపు 2,450 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించి అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు ఉన్న అవకాశాలను అధ్యయం చేస్తోంది. దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్గా ఏర్పాటుచేసేందుకు ఐదువేల ఎకరాలు అవసరం అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. మేరకు భూమిని సమీకరించే అవకాశాలు కూడా ఉన్నాయని అనుకుంటోంది.దొనకొండ ప్రాంతాన్ని పారిశ్రామిక హబ్ గా తీర్చి దిద్దేందుకు గతంలోనే కేంద్రానికి ప్రతిపాదనలు అందాయి. ఇప్పుడు సరి కొత్త పారిశ్రామిక పాలసీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దొనకొండ ప్రాంతంలో.. ప్రభుత్వ భూములు భారీగా ఉండడంఅదే సమయంలో రామాయపట్నం పోర్టు వస్తే దానికి కూడా దగ్గరగా దొనకొండ ఉండడం కలిసొచ్చే అంశాలవుతాయని భావిస్తున్నారు. నూతన పారిశ్రామిక విధానం రూపొందించాక, దొనకొండ ఇండస్ర్టియల్హబ్పై మరింత దృష్టిపెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos