ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా రూ.1 లక్ష అప్పు..

ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడే పుట్టిన బిడ్డపై కూడా రూ.1 లక్ష అప్పు..

 ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థికపరిస్థితిపై ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి శ్వేతపత్రం విడుదల చేశారు.రాష్ట్రవిభజన జరిగాక మొదటిసారి అధికారంలోకి వచ్చిన తెదేపా ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అక్రమాలు,అవకతవకలకు పాల్పడిందని పెట్టుబడుల అంశంపై నిర్లక్ష్యం వహిచిందని పేర్కొన్నారు.ఐదేళ్లలో కనివినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని,సహజవనరులను దోచుకొని దివాళ తీసిన రాష్ట్రాన్ని తమకు అప్పగించారని అయినా కూడా ధైర్యంగా రాష్ట్రాన్ని ముందుకు నడిపించడానికి కసరత్తులు చేస్తున్నామన్నారు.తెదేపా ప్రభుత్వ అంకెలగారడీ, అబద్దాల అభివృద్ధి వల్ల ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రుణాలు రూ.3.62లక్షల కోట్లకు చేరుకున్నాయని దీంతో ప్రతి పౌరుడు ఏడాదికి రూ.10వేల వడ్డీ చెల్లించాల్సిన పరిస్థితిలో ఉందని చెప్పారు.FRBM చట్టం ప్రకారం రాష్ట్ర డీజీపీలో 3 శాతం దాటి అప్పులు చేయవద్దనే సూచనలు దాటి అంతకు మించి గత తెదేపా ప్రభుత్వం అప్పులు చేసిందన్నారు. 2017-18లో పరిమితికి మించి 4.08 శాతం అప్పులు చేసిందన్నారు. 2014-17 మధ్య ఏపీలో 5 శాతం వృద్ధి మాత్రమే ఉందని, ద్రవ్యోల్భణం జాతీయస్థాయిలో తగ్గగా, ఏపీలో మాత్రం భారీగా పెరిగిందన్నారు. గత ప్రభుత్వం వృద్ధి అంచనాలు పెంచి చూపిందని ఆరోపించారు.పన్ను రూపంలో వచ్చే ఆదాయంలో తెలంగాణ కంటే వెనుకబడి ఉన్నామన్నారు. రెవెన్యూ లోటు రూ.66వేల కోట్లకు పెరిగిందని చెప్పారు. తలసరి ఆదాయంపరంగా తెలంగాణ కంటే బాగా వెనుకబడి ఉన్నామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం నిర్మించాలని, కానీ టీడీపీ సర్కార్ తీసుకుందని, అలాగే, దుగరాజుపట్నంను కేంద్రమే కట్టాలని, దానిని టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. 2018-19 డిస్కంలకు రూ.8వేల కోట్లు రావాల్సి ఉండగా, రూ.2,500 కోట్లు మాత్రమే కేటాయించి, రూ.1,200 కోట్లు మాత్రమే చెల్లించిందన్నారు.గత ప్రభుత్వం ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ రూపంలో రూ.58,000 కోట్లు, విద్యుత్ శాఖ, పౌరసరఫరాల శాఖల కార్పొరేషన్ల ద్వారా రూ.28,375 కోట్ల రుణం తీసుకుందని, పెండింగ్ బిల్లులు రూ.18,000 కోట్లు ఉన్నాయని చెప్పారు. కాంట్రాక్టర్ల బిల్లులు ఎప్పటికప్పుడు చెల్లిస్తూ, ఆశా, అంగన్వాడీ, ఔట్ సోర్సింగ్ లాంటి చిరుద్యోగుల బిల్లులు, మధ్యాహ్న భోజన పథకం బిల్లులు, హోంగార్డుల వేతనాల బిల్లును పెండింగులో ఉంచారన్నారు. టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంపై స్థూల జాతీయోత్పత్తిలో 35 శాతం(రూ.3,62,375) చెల్లింపుల భారాన్ని మిగిల్చిందన్నారు.ఏపీలో పుట్టిన బిడ్డపై తలసరి రుణభారం రూ.42,500 ఉన్నాయని చెప్పారు. ఎస్పీవీ, ఇతర అప్పులు తీసుకుంటే తలసరి అప్పు రూ.1 లక్ష ఉందని చెప్పారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos