పెట్టుబడలకు అవినీతి రహిత పాలన అవసరం..

పెట్టుబడలకు అవినీతి రహిత పాలన అవసరం..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో నిజాయితీతో పని చేస్తోందంటూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.విజయవాడ గేట్‌వే హోటల్‌లో భారత విదేశాంగ శాఖ ఆధ్వరయంలో జరుగుతున్న డిప్లొమాటి్క్‌ సదస్సులో ముఖ్యఅథిధిగా పాల్గొన్న వైఎస్‌ జగన్‌ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూలతలు,పీపీఏల రద్దు తదితర అంశాలపై ప్రసంగించారు.తాము అధికారంలోకి వచ్చాక రూ.20వేల కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పవర్‌ డిస్కంల బాధ్యత చాలా దారుణంగా ఉందన్నారు. రెవెన్యూ తక్కువగా ఉండి.. వ్యయం పెరిగితే డిస్కంలు పనిచేయలేవని అందుకే పీపీఏలను పున: సమీక్షిస్తున్నామని జగన్ తెలిపారు. పీపీఏల వల్ల రాష్ట్రానికి లాభం లేకపోవడం వల్లే వాటిని రద్దు చేశామని సీఎం స్పష్టం చేశారు. ఇది వివాదస్పదమని కొందరు విమర్శించారని.. అయితే ఎక్కువ ధరకు ఎందుకు కరెంట్ కొనాలని జగన్‌ ప్రశ్నించారు. ఈ 60 రోజుల పాలనలో ఎన్నో మార్పులు చేసి చూపించామని.. విప్లవాత్మక నిర్ణయాలతో పాలనలో ఎంతో మార్పు తీసుకొచ్చామని వైఎస్‌ జగన్‌ తెలిపారు.దేశాల్లో,రాష్ట్రాల్లో పెట్టుబడలకు అవినీతి రహిత పాలన అవసరమని జగన్‌ పేర్కొన్నారు.పొరుగు రాష్ట్రాలతో ఏపీకి సన్నిహిత సంబంధాలున్నాయని.. కేంద్రం అండదండలు కూడా రాష్ట్రానికి ఉన్నాయని ముఖ్యమంత్రి వివరించారు.సుమారు 975 కిలోమీటర్ల విస్తారమైన సముద్రతీరం కలిగిన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఇప్పటికే నాలుగు ఓడరేవులు ఉన్నాయని వచ్చే ఐదేళ్లలో మరో నాలుగు ఓడరేవులు రానున్నాయని జగన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వున్న అవకాశాలు వివరించేందుకే సదస్సును ఏర్పాటు చేశామని.. రాష్ట్రంలో వ్యవసాయం, ఆక్వా రంగాల్లో విస్తృతమైన అవకాశాలున్నాయన్నారుఏపీలో పెట్టుబడులు పెట్టాలని అందరినీ ఆహ్వానిస్తున్నామని.. మా ఆహ్వానికి అర్ధం.. స్థానికులకు ఉపాధి, ఉద్యోగాలని, యువతకు ఏం అర్హతలు, నైపుణ్యం కావాలో చెబితే తీర్చిదిద్దుతామని జగన్ స్పష్టం చేశారు.తమది పేద రాష్ట్రమేనని.. హైదరాబాద్ లాంటి నగరం తమకు లేదని కానీ తమకు బలముందన్నారు. పారదర్శక పాలనతో ముందుకెళ్తున్నామని మా బలహీనతలు అధిగమించి అభివృద్ధి పథంలో నడిపించడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నామన్నారు..

    

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos