బిహార్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నిర్వాకం..

బిహార్‌ ఎగ్జామినేషన్‌ బోర్డు నిర్వాకం..

ఎన్నికల గుర్తింపు కార్డులు,ఆధార్‌ కార్డుల్లో ఒకరి ఫోటోలకు బదులు మరొకరి ఫోటోలు కొన్నిసార్లు జంతువుల ఫోటోలు సైతం దర్శనమిస్తుంటాయి. అయితే హాల్‌టికెట్‌పై తనకు బదులు హీరోయిన్‌ ఫోటో ముద్రించడంతో విద్యార్థి బిక్కమొహం వేశాడు.బిహార్‌ రాష్ట్రానికి చెందిన రిషికేష్‌ కుమార్‌ అనే యువకుడు టీచర్ ఎలిజిబిలిటీ కోసం ఎస్‌ టెట్‌ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నాడు.ఈ క్రమంలో ఈ నెల 28న జరిగే పరోక్ష కోసం ఆ రాష్ట్ర బోర్డు ఆన్‌లైన్‌లో హాల్ టికెట్లు విడుదల చేసింది బోర్డు.ఎంతో ఆశగా తన అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసి చూసుకున్న రిషికేశ్ షాక్ అయ్యాడు.అందులో తనకు బదులు ఎవరో అమ్మాయి ఫోటో ఉండడం చూసి షాకయ్యాడు.మొదట ఎవరో అమ్మాయి ఫోటోగా భావించిన యువకుడు కొద్ది సేపటికి ఆ ఫోటోలో ఉన్న దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌ అనుమప పరమేశ్వరన్‌ అని తెలుసుకొని వెంటనే సంభందింత అధికారులను సంప్రదించగా వాళ్లు తప్పును దిద్దుకునే లోపే విషయం బయటకు వచ్చి సోషల్ మీడియా వైరల్‌గా మారిపోయింది.గతంలో ఒకసారి బీహార్‌లో ఇలాగే ఓ ఇంజినీరింగ్ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లో సన్నీలియోన్ ఫోటో రావడం తెలిసిందే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos