తమిళంలో జాతీయ గీతం

తమిళంలో జాతీయ గీతం

చెన్నై: తిరుప్పూరు జిల్లా సేవూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో తమిళంలో జాతీయ గీతాన్ని ఆలపించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో సంచలనాన్ని సృష్టించింది. ఆ వీడియోను తిరుప్పూరు జిల్లా సేవూర్‌లోని ప్రభుత్వ పాఠశాల టీచర్‌ ఇవాంజలిన్‌ ప్రిస్కిల్లా విడుదల చేశారు. ‘నేను ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్ల టీచర్‌గా 18 ఏళ్లపాటు పని చేస్తున్నాను. సాధారణంగా మన విద్యార్థులు ఆంగ్లం నేర్చుకునేందుకు ఇబ్బందిపడుతుంటారు. అది గమనించి ప్రాంతీయ భాషలోకి తర్జుమా చేసి నేర్పించడం మొదలుపెట్టాను. ప్రతి రోజూ 5 ఆంగ్ల పదాలు, స్పోకెన్‌ ఇంగ్లీష్‌ శిక్షణ ఇచ్చేదాన్ని. ఆ క్రమంలో ఇతర భాషల్లో ఉన్న ప్రధాన అంశాలను తమిళ భాషల్లో తర్జుమా చేయడం నేర్పించడం ఆరంభించాను. అప్పుడు మన జాతీయ గీతాన్ని తమిళంలోకి తర్జుమా చేస్తే ఎలా వుంటుందన్న ఆలోచన కలిగింది. ఒక ప్రయత్నం చేద్దామని తమిళంలో జాతీయ గీతాన్ని పాడి 52 నిమిషాల వీడియోని విడుదల చేశాం. ప్రజల నుంచి ఆ వీడియోకు అద్భుతమైన స్పందన లభించింది. చాలామంది ప్రశంసించారు. అయితే పలు విమర్శలు కూడా ఎదురయ్యాయి. తమిళ భాషను ఆరాధించే ప్రజలు తమిళ జాతీయ గీతాన్ని ఆదరిస్తున్నారు. ఇది జాతీయ గీతానికి ఖచ్చితమైన తమిళ తర్జుమా అని చెప్పలేను అయితే భావాన్ని బట్టి తర్జుమా చేశాను’ అని చెప్పారు. ఇదీ ఆ గీతం

ఇనంగళుమ్‌, మొళిగళుమ్‌ ఆయిరం ఇరుందుమ్
(జాతులు, భాషలు వెయ్యి ఉన్నప్పటికీ)
మనంగళిల్‌ భారత తాయే, వడక్కే విరింద
(మనసుల్లో భారతమాత, ఉత్తరాన వ్యాపించిన)
దేశాభిమానం తెర్కిల్‌ కుమరియిల్‌ ఒలిక్కుం
(దేశభక్తి దక్షిణాన కుమరిలో ప్రతిధ్వనించే)
ఇనమద వేట్రుమై ఉడైయిల్‌ ఇరుందుమ్
(జాతి మత భిన్నత్వం ఉన్నప్పటికీ)
ఇదయత్తిల్‌ ఒట్రుమై దానే
(హృదయాల్లో సమైక్యతే కదా)
ఉలగినిల్‌ ఎత్తిసై అలైందుమ్
(ప్రపంచంలో ఏ దిక్కుకు వెళ్లినా)
ఇరుదియిల్‌ ఇందియన్‌ ఆవేన్‌, ఉరుదియిల్
(చివరకు భారతీయుడినే ఉంటా, వాస్తవానికి)
మూవర్ణం దానే, ఇనమో మొళియో ఎదువాయ్
(త్రివర్ణాలే కదా, జాతో భాషో ఏదైనా)
ఇరుందుమ్‌ నిరంతరం భారత తాయే
(ఉంటుంది భారతమాతే శాశ్వతం)
వాళ్గ, వాళ్గ ఎండ్రెండ్రుమ్‌ నీ వాళ్గ
(వర్ధిల్లు, వర్థిల్లు, ఎప్పటికీ నువ్వు వర్ధిల్లు)

తాజా సమాచారం

Latest Posts

Featured Videos