వైసీపీలోకి మరో తెలుగు ఎమ్మెల్యే!

వైసీపీలోకి మరో తెలుగు ఎమ్మెల్యే!

తెలుగుదేశం ఎమ్మెల్యే వైసీపీలో చేరడానికి సిద్ధమవుతున్నారనే వార్త తెదేపాలో కలకలం సృష్టిస్తోంది.ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ వైసీపీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నట్లు వస్తున్న వార్తలు తెదేపాలో కలకలం సృష్టిస్తున్నాయి.గతంలో వైసీపీ నుంచి తెదేపాలో చేరి ఎన్నికల్లో పోటీ చేసి అద్దంకి నుంచి విజయకేతనం ఎగురవేసిన గొట్టిపాటి రవికుమార్ తిరిగి తన సొంత గూటికి వెళ్లాలని ఆలోచిస్తున్నారని టాక్ వినిపిస్తుంది.తెదేపా నుంచి విజయం సాధించినా రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రావడంతో గొట్టిపాటికి కష్టాలు మొదలయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. నియోజకవర్గ పరిస్థితుల గురించి తనకు ఎదురవుతున్న ఇబ్బందుల గురించి టిడిపి అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు.ఎటువంటి సమస్య వచ్చినా అండగా ఉంటామని హామీ ఇచ్చినప్పటికీ గొట్టిపాటి రవికుమార్ వైసిపిలోకి వెళ్లడానికి ఆసక్తి చూపుతున్నట్లు తెలుస్తోంది.కాగా వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గొట్టిపాటికి సంబంధించిన బల్లికురవ, చీమకుర్తి లో ఉన్న గ్రానైట్ వ్యాపారం నిలిచిపోయింది.అప్పటినుండి వ్యాపారపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న రవికుమార్ ఇదే విషయాన్ని చంద్రబాబుతో కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేకపోవడంతో టిడిపికి రాజీనామా చేసి వైసీపీలో చేరాలని చూస్తున్నారని స్థానికంగా చర్చ జరుగుతుంది. గ్రానైట్ వ్యాపారమే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న గొట్టిపాటి రవికుమార్ కు వ్యాపారం నిలిచిపోవడంతో ఎదురవుతున్న ఇబ్బందులు ఒకవైపు, జగన్ తో ఉన్న సన్నిహిత సంబంధాలు మరోవైపు, వైసీపీ నేతల ఒత్తిడి ఇంకొకవైపు.. ఇవన్నీ గొట్టిపాటిని వైసీపీలో చేరడానికి కారణాలుగా తెలుస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos