కేజ్రీవాల్‌పై హజారే అసంతృప్తి

కేజ్రీవాల్‌పై  హజారే అసంతృప్తి

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు చర్చలు జరిపినందుకు బాధపడినట్లు అన్నా హజారే శనివారం ఇక్కడ విలేఖరులకు తెలిపారు. ‘నేను చాలా బాధపడ్డాను. 2010-2011లో మేం కలిసి పని చేశాం. లోక్‌పాల్ బిల్లు గురించి కాంగ్రెస్‌ కు వ్యతిరేకంగా ఉద్యమించాం. ఇప్పుడు అధికారం కోసం అదే కాంగ్రెస్‌తో చేతులు కలపాలనుకోవడం పట్ల నేను తీవ్ర మనోవేధనకు గురయ్యాను’ అన్నారు. ‘ఈ రోజు ఇలాంటి వార్త వింటానని అనుకోలేదు. ఆయన (అరవింద్ కేజ్రీవాల్) అధికారం కోసం, డబ్బు కోసం కాంగ్రెస్‌తో పొత్తుకు ప్రయత్నించడం చాలా బాధ కలిగించింది. డబ్బు కోసం, అధికారం కోసం మనమెక్కడికి వెళ్తున్నాం? మానవత్వం, సామాజిక, జాతీయత దృష్టి ఉందా, లేదా?’ని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos