వరదనీటిలో అనుకోని అథిధి..

వరదనీటిలో అనుకోని అథిధి..

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కర్నూలు,కడప జిల్లాల్లో నదులు,వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పెన్నా, కుందూ, చిత్రావతి తదితర నదులు ప్రమాదస్థాయి దాటి ప్రవహిస్తున్నాయి.భారీ వర్షాల కారణంగా కర్నూలు జిల్లాలోని మహానంది క్షేత్రం పూర్తిగా జలద్బింధంలో చిక్కుకోగా నంద్యాల, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల తదతర పట్టణాలు సైతం జలదిద్బంధనంలో చిక్కుకున్నాయి. భారీ వర్షాలకు కుందూనది ఉప్పొంగడంతో వరదలకు కొట్టుకువచ్చిన ఓ మొసలి నంద్యాల పట్టణంలోని సలీమ్ నగర్ వీధుల్లో హల్ చల్ చేసింది.వీధుల్లో సుమారు మోకాలి లోతు వరకు నిలిచిన నీటిలో తిరుగాడుతూ కనిపించింది. మొదట దీన్ని చేపలా భావించిన స్థానికులు మొసలిగా తేలడంతో భయభ్రాంతులకు గురయ్యారు.స్థానికుల్లో ఒకరు ఓ తాడు సహాయంతో దాన్ని బంధించి అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మొసలి కొట్టుకుని వచ్చిన విషయాన్ని అటవీశాఖ డివిజనల్ కార్యాలయానికి ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే సలీమ్ నగర్ కు చేరుకున్న అటవీశాఖ సిబ్బంది మొసలిని బంధించారు.దాన్ని శ్రీశైలం రిజర్వాయర్ లో వదిలివేస్తామని తెలిపారు.శ్రీశైలం జలాశయం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా విడుదల చేసిన కృష్ణా జలాల్లో కొట్టుకొని వచ్చి ఉంటుందని అధికారులు తెలిపారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos