అమ్మే గెలిచింది..

అమ్మే గెలిచింది..

ఆ రోజు ఉదయం అర్జంటు కేసు ఉండడం వలన కాస్త త్వరగానే రెడీ అయి, కోర్టుకు బయలుదేరబోతున్న సమయంలో, నా భీమవరం స్నేహితుడు అడ్వొకేట్‌ శివకృష్ణ నుండి వచ్చిన ఫోన్‌కాల్‌ నన్ను కొన్ని క్షణాలపాటు స్తబ్ధుణ్ణి చేసింది. భీమవరం మావుళ్ళమ్మ ప్రసాదాన్ని చేతికందించినట్టుగా, ఎన్నాళ్ళుగానో నేను వెతుకుతున్న ఓ ముఖ్యమైన ‘సమాచారం’ చెప్పాడు. చేతిలో ఉన్న ఫైళ్ళు, కోటు, గౌను పక్కనపెట్టి అతను చెపుతున్న వివరాలు వింటూ అలా సోఫాలో కూర్చుండిపోయాను.ఫోన్‌ పెట్టేస్తూనే… ‘‘శాంతీ, ఓసారి ఇలారా…’’ అని పిలిచాను.అప్పటివరకూ కోర్టు హడావుడితో సీరియ‍స్‌గా ఉన్న నా ముఖంలో కొట్టొచ్చినట్టు కనబడుతున్న సంబ్రమాశ్చర్య ఛాయలు చూస్తూ, ‘‘ఏంటండీ.? ఎక్కడ నుంచి ఫోన్‌?’’ అని అడిగింది శాంతి. ‘‘ఇన్నాళ్ళుగా మనం వెతుకుతున్న డాక్టర్‌ అనసూయమ్మగారి కుటుంబం మన హైదరాబాద్‌ లోనే ఉందట’’ ‘‘ఓ… మైగుడ్‌నెస్‌…’’ శాంతి ముఖం సంతోషంతో విప్పారింది.ఫోన్‌ తీసుకుని, నగరంలోని ఫేమస్‌ కార్పొరేట్‌ హాస్పిటల్‌ ‘‘సిమ్స్‌’’ ఎం.డి సత్యవర్ధనరాజుకి ఫోన్‌ చేశాను.‘‘గుడ్మానింగ్‌ అడ్వొకేట్‌ జీ…! ఏమిటీ ఇంత ఉదయాన్నే నేను గుర్తొచ్చాను..?’’ నవ్వుతూ అడిగాడతను. అతని ప్రశ్న పట్టించుకోకుండా విషయం గబగబా చెప్పాను.అవతల నుండి ఓ నిమిషం నిశ్శబ్దం.ఆ తరువాత, ‘‘ఓకే…విత్‌ ప్లెజర్‌… తప్పకుండా రండి.. మీ కోసం ఎదురుచూస్తుంటాను’’ చెప్పాడతను. మార్నింగ్‌ సెషన్‌లోని నా కేసును నా జూనియర్‌కి అప్పగించి, కార్‌లో హాస్పిటల్‌కి బయలుదేరాను.

అన్నం శ్రీధర్‌ (బాచి)

తాజా సమాచారం

Latest Posts

Featured Videos