ఢిల్లీ చేరిన పంజాబు పంచాయతి

ఢిల్లీ చేరిన పంజాబు పంచాయతి

న్యూ ఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్ యూనిట్లో తలెత్తిన అంతర్గత పోరు హస్తినకు చేరుకుంది. దీని పరిష్కారానికి ఏర్పాటైన మల్లికార్జున్ ఖర్గే సారథ్యంలోని త్రిసభ్య సమితిని కలుసుకునేందుకు పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ మంగళవారం ఇక్కడకు వచ్చారు. ఆరుగురు మంత్రులతో సహా సుమారు డజను మంది తిరుగుబాటు ల్ నేతలు రాహుల్ గాంధీని కలుసుకోనున్నారు. పంజాబ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్ధూ గత ఆదివారం మరోసారి కెప్టెన్పై మాటల దాడి చేయడంత వాతావరణం మరింత వేడెక్కింది. ఉప ముఖ్యమంత్రి పదవిని అంగీకరించేందుకు సిద్ధంగా లేదని సంకేతాలిచ్చినట్లు చెబుతున్నారు. ఏఐసీసీ కార్యదర్శి, ఫతేగఢ్ సాహిబ్ ఎమ్మెల్యే కుల్జిత్ సింగ్ నగ్రా సోమవారం రాహుల్ను కలిసారు. అకాలీదళ్ పార్టీ కష్టపడి పనిచేస్తుండగా, కాంగ్రెస్ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోతోందని తిరుగుబాటు నేతల ఫిర్యాదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos