అమిలా షా విదేశీనా? స్వదేశీనా?

అమిలా షా విదేశీనా? స్వదేశీనా?

గువహాటి: అస్సాంలోని అమిలా షా (40) అనే మహిళ విదేశీయురాలని ట్రిబ్యూనల్‌ ప్రకటించటంతో జూన్ 15న ఆమెను బంధించారు. తను విదేశీయురాలు కాదని తమ పూర్వీకులు బిహార్‌కు చెందినవారని కుటుంబ సభ్యులు చెప్పారు. అమిలా షా తండ్రి నలందకు చెందిన ప్రసాద్ గుప్త 1948లో అస్సాంకు వలస వచ్చి టీ కొట్టు వ్యాపారం జీవిక సాగించేవాడని చెప్పారు. అయితే తమ వాదనలకు తగిన ఆధారాలు చూపలేక పోయారు. ‘జూన్ 15న నా సోదరి అమిలా షాను అరెస్ట్ చేసి డిటెన్షన్ సెంటర్‌కు తరలించారు. మేము స్వచ్ఛమైన భారతీయులం. అస్సాంలో ఉన్న హిందీ మాట్లాడే సమూహానికి చెందినవారం. మేము చాలా పేదవాళ్లం, విద్యాపరంగా వెనకబడి ఉన్నాం. అందుకే ట్రైబ్యూనల్ అడిగిన వివరాల్ని చూపించలేకపోయాం’’ ఆమె సోదరుడు రమేశ గుప్త వివరించారు. ‘ఎన్‌ఆర్‌సీ చట్టం విదేశాల నుంచి అస్సాంకు వలస వచ్చిన వారిని వెనక్కి పంపేది. మేము ఇదే దేశానికి చెందిన వాళ్లం. మమ్మల్ని కూడా విదేశీయులని అస్సాం నుంచి పంపించేస్తారా?’ అని అమిలా షా కుమారుడు భోలా షా ఆవేదన చెందారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos