అల్లు అర్జున్‌ మల్లూ అభిమానుల హంగామ..

  • In Film
  • January 8, 2020
  • 139 Views
అల్లు అర్జున్‌ మల్లూ అభిమానుల హంగామ..

సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలకు సిద్ధమైన అల్లు అర్జున్‌ నటించిన అలవైకుంఠపురములో చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పాటలు రికార్డులపై రికార్డులు సృష్టించగా తాజాగా నిర్వహించిన ప్రీరిలీజ్‌ వేడుక చిత్రంపై అంచనాలు మరింత పెంచింది.ఇక తెలుగు రాష్ట్రాలతో పాటు అల్లు అర్జున్‌కు భారీస్థాయిలో ఫ్యాన్‌ఫాలోయింగ్‌ ఉన్న కేరళలో సైతం అల చిత్రంపై అంచనాలు ఒక రేంజులో ఉన్నాయి.తెలుగు రాష్ట్రాల తరహాలనే కేరళలో సైతం అభిమానులు చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.ఈ నేపథ్యంలో అల చిత్రం మలయాళం వెర్షన్‌కు సంబంధించి కేరళలో అభిమానులు హంగామా మొదలుపెట్టేశారు.’అంగు వైకుంఠపరుతు’ పేరుతో విడుదల కానుండగా అభిమానులు కేరళలోని వివిధ పట్టణాల్లో చిత్ర పోస్టర్స్ విడుదల చేసి సినిమాకు ప్రచారం ప్రారంభించారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos