ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబాల్ని విడుదల చేయాలి

ఫరూఖ్ అబ్దుల్లా, మెహబూబాల్ని విడుదల చేయాలి

వాషింగ్టన్: జమ్మూ-కశ్మీర్లో పరిస్థితులు క్రమంగా మెరుగవు తున్నందున నిర్బంధించిన నేతల్ని వెంటనే విడుదల చేయాలని అమెరికా శనివారం భారత్కు సలహా ఇచ్చింది. అంతర్జాల సేవల పునరుద్ధరణ, నిషేదాజ్ఞల్ని తొలగింపు చర్యలు అభినంద నీ య మని అభిప్రాయపడింది. అమెరికా విదేశాంగశాఖ, దక్షిణ, మధ్య ఆసియా విభాగం సహాయకార్యదర్శి అలైస్ వెల్స్ భారత పర్యటన తర్వాత ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ఇటీవల కశ్మీర్లో విదేశీ రాయబారుల పర్యటన ముందడగు. ఇదే తరహాలో మున్ముందూ దౌత్యవేత్తల్ని కశ్మీర్కు అనుమతించాలి. నిర్బంధంలో ఉన్న రాజకీయ నాయకుల్ని వీలైనంత త్వరగా విడుదల చేయాల’ని కోరారు. నూతన పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా సాగుతున్న ఆందోళనల గురించీ కూడా వెల్స్ స్పందించారు. అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేలా ప్రభుత్వం నడుచుకోవాలని సూచిస్తున్నామన్నారు. అంశాల్లో భారత్-అమెరికా మధ్య సత్సంబంధాలు బలపడుతున్నాయని చెప్పారు.

తాజా సమాచారం