పక్షపాతంతో కూడిన సర్వేలు ప్రజలను అయోమయానికి గురి చేస్తాయి

పక్షపాతంతో కూడిన సర్వేలు ప్రజలను అయోమయానికి గురి చేస్తాయి

లఖ్నవూ : ఒపీనియన్ పోల్స్ సర్వే ప్రసారాలను నిషేధించాలని ఎన్నికల సంఘాన్ని సమాజ్ వాదీ పార్టీ డిమాండ్ చేసింది. మెజారిటీ ఒపీనియన్ పోల్స్ బీజేపీకే అధికారం తిరిగి దక్కుతుందని, ఎస్పీ గతంతో పోలిస్తే బలం పుంజుకుంటుందని వెల్లడించాయి. బీజేపీ ఆధిపత్యం కొంత తగ్గొచ్చని అంచనా వేశాయి. దీంతో ఈ తరహా ప్రసారాలు, ప్రచా రం ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిస్తాయని ఎస్పీ ఈసీకి లేఖ రాసింది. ‘‘యూపీలో చివరిదైన ఏడో విడత ఓటింగ్ మార్చి 7న జరుగుతుంది. ఫలితాలు 10న వెలు వడ తాయి. అయినప్పటికీ కొన్ని న్యూస్ చానళ్లు ఒపీనియన్ పోల్స్ ఫలితాలను చూపిస్తున్నాయి. ఇది ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం. ఓటర్లను అయోమయానికి గురి చేసి, పోలింగ్ ను ప్రభావితం చేస్తాయి’’ అంటూ ఎస్పీ చీఫ్ నరేశ్ ఉత్తమ్ పటేల్ వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos