చికాకు ఎందుకు ? బాబూ

చికాకు ఎందుకు ? బాబూ

విజయవాడ:విధానసభ ఎన్నికల్లో తెదేపా పరాజయం పాలైనా పార్టీ ఉనికికి ముప్పు లేనందుకు అనవసర చికాకును తగ్గించుకోవాలని లోక్‌సభ మాజీ సభ్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మంగళవారం ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబునాయడుకు హితవు పలికారు. విజయవాడ్‌ ప్రెస్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో జరిగిన మీట్ ది ప్రెస్‌లో ఆయన పాల్గొన్నారు. ‘మీరు ఓడిపోయినా మీ పార్టీ జనంలో ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి బలమైన కార్యకర్తల శ్రేణి ఉంది. చంద్ర బాబు నాయుడు అంటే దేశంలోనే అత్యధిక సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తులలో ఒకరు. ఫలితాలు రాక ముందే ఎందుకు ఆవేశపడుతున్నారో అర్థం కావటంలేద’ని వ్యాఖ్యానించారు. తన ఓటు తనకే పడిందో లేదో తెలియదన్న చంద్ర బాబు నాయుడు 130 సీట్లతో అధికారంలోకి వస్తామని ఎలా చెబుతారని ప్రశ్నించారు. ఈవీఎంలపై చేస్తున్న రాద్ధాంతం సరికాద న్నారు. ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ రశీదుల విధానాలన్నీ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలోనే వచ్చాయని గుర్తు చేశారు. గతంలోఈవీఎంలతో ఎన్నికలు జరిపినపుడు పరాజయం పాలైనా, గెలిచినా ఏ విధమైన వ్యాఖ్యల్ని చేయని చంద్రబాబు నాయుడు ఇప్పుడు వాటిపైనే మండి పడుతుండటం అవగతంకావటం లేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos