ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న మోదీ

ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేస్తున్న మోదీ

న్యూ ఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీ తన స్దాయికి తగని వ్యాఖ్యలు చేస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని కాంగ్రెస్ ఆక్షేపించింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆస్తుల పున:పంపిణీ చేసి కొందరికి వాటిని కట్టబెడుతుందని మోదీ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని పేర్కొంది. రాజస్ధాన్లోని జలోర్లో జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ దేశ వనరులపై తొలి హక్కు ముస్లింలకు ఉంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీ మీ ఆస్తులను లాగేసుకుని తమకు ఇష్టమైన వారికి కట్టబెడుతుందనే తరహాలో మోదీ మాట్లాడటం సరైంది కాదని వ్యాఖ్యానించింది. దేశ ప్రధాని నుంచి ఆ తరహా ప్రకటనను దేశం ఆశించలేదని కాంగ్రెస్ ఎంపీ కే. సురేష్ ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్కు వ్యతిరేకంగా ప్రధాని చేసిన వ్యాఖ్యలు సహించరానివని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధానులు ఎంతో హుందాగా, మర్యాదగా వ్వవహరించేవారని, వారు విపక్షాన్ని గౌరవించేవారని గుర్తుచేశారు. ప్రతిపక్షాలను అప్పటి ప్రధానులు విమర్శించినా హుందాగా వ్యాఖ్యలు చేసేవారని ఆయన పేర్కొన్నారు. ఇక కేరళలో తమ ప్రచారం సాఫీగా సాగుతోందని, గత ఎన్నికల కంటే మెరుగైన స్ధానాలు సాధిస్తామని చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos